ఒకానొక ఊరు చివారి లో అటవీ ప్రాంతమందు ఒక ఋష్యాశ్రమంఉంది . ఆయాశ్రమ గురువుగారికి ఒక శ్యామశర్మ అనే శిష్యుడు ఉన్నాడు. గురువుగారు కాశీ విశ్వనాధుడి దర్శనానికి వెళ్లాలని నిర్యాయించుకున్నారు. అయన వచ్చే దాక ఆశ్రమ బాధ్యతను శియుషుడికి ఒప్పగించి, బయలుదేరారు .
శ్యాముడు ప్రశాంతమైన అటవీ ఆశ్రమము , గురువు గారు వచ్చేదాకా తప్పస్సు చేసుకుందామని నిరయంచించుకున్నాడు.
బ్రహ్మచారి ఆశ్రమవాసి కావున ఒక రెండు కౌపీనలు(ఇప్పటి భాష లో గోచి ) తప్ప పెద్దగా హంగు ఆర్భాటాలు ఏమి లేవు. ఒకటి కట్టుకున్నది రెండవది ఆరవేసి ఉంది
అటవీ ప్రాంతం చేత చిన్న పొన్న రకరకాల జంతువులు ఉండేవి . ఇలా ఆరవేసిన శర్మ గారి కౌపీనాన్ని ఒక రోజు ఎలుక కొట్టేసింది. చిరిగిపోయిన కౌపీనం తో ఎలాగా అనుకోని శ్యామశర్మ ఊరిలోకి వెళ్లి తెలిసిన వారిని కౌపీనీనార్ధం ఒక బట్ట ఇమ్మని అడిగి తెచ్చుకున్నాడు.
సరే బాగానే ఉంది అనుకోగానే మల్లి ఆ ఎలుక ఆరబెట్టినా బట్ట ని కొట్టేసింది. ఇలా రెండు మూడు సార్లు వెళ్లి ఊరి వారి దగ్గర బట్ట తెచ్చుకోడం శర్మ గారికి ఆట్టే నచ్చలేదు. ఏ ఎలుక సంగతి ఎదో గట్టిగ చూడాలి అనుకోని , ఊరిలో వారికీ విషయం చెప్పి ఒక పిల్లిని తెచ్చి పెట్టుకున్నాడు.
పిల్లి రాకతో ఆ బట్టలు కొట్టేస్తున్న ఎలుక తో పాటు చుట్టూతా ఉన్న మిగతా ఎలుకల్ని కూడా పిల్లి పనిబట్టింది , దానితో శర్మ గారికి కాస్త ఊరట కలిగింది . ఒక వారం గడిచాక ఎలుకలు లేక ఆహరం లేక పిల్లి ఒకటే మీయం మీయం అని గోల పెట్టి శ్యామశర్మ గారిని ధ్యానం చేసుకోనివ్వలేదు .
ఈ పిల్లి సంగతి ఇలా కాదు అని ఊరివారితో విషయం చెప్పగా దాందేముంది గురువు గారు మీరు వచ్చినపుడల్లా కాసిన్ని పాలు ఇస్తూ ఉంటాం పిల్లికి ఇవ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అన్నారు, సరే ఇదేదో బాగుంది అని అలాగే చేయడం మొదలెట్టాడు . ఇలా కొన్ని రోజులయ్యాక రోజు వెళ్లి పాలు తెచ్చుకోడం కన్నా నేనే ఒక ఆవు ని తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది అనుకోని , ఊరిలో వాళ్ళకి చెప్పగా, అయ్యో దానిదేముంది మేమే మీకు చెబుదాం అనుకుంటున్నాం అని ఒక ఆవు ని అడవిలోకి తోలారు
ఆశ్రమం లో పిల్లి ఆవుతో కొన్ని రోజులు గడిచాయి, రోజు ఆవుకి మేత కోసం ఊరి వారిని గడ్డిమోపు ఎం అడుగుతాం అని విసుగుపుట్టి, ఊరి వాళ్ళ సాయంతో ఆ అడవిడిలో ఒక మేర నేలని బాగా దున్ని గోధుమలు పంచిండం మొదలెట్టారు
అటవీప్రాంతం అవ్వటం వల్ల త్వరగా పంట వచ్చింది ధాన్యాలు బస్తాలోకి ఎక్కించి ఊరిలో వాళ్ళకి ఇచ్చేవారు ఆ మిగిలిన గడ్డిని ఆవుకి మేతగా వేస్తూ కాలం గడుపుతున్నాడు .
ఇలా ఉండగా ఒకరోజున అటుగా వెళ్తున్న అయన ఈ ఆవుని పిల్లిని పొలం పనులు చేస్తున్న శ్యామా శర్మ ని చూసి, ఏవయ్య ఒక్కడివే ఎన్నాళ్ళు కష్టపడతావ్ ఒక మంచి అమ్మాయిని సీచూసీ పెళ్లి చేసుకో , ఇంటి పనులు చూసుకుంటూ నీకు సాయంగా ఉంటుంది అని సలహా ఇచ్చి, ఒక పిల్లని చూసి శర్మ గారికి పెళ్లి చేసారు
వచ్చిన భార్య పిల్లి ఉంది ఆవు ఉంది ఇంటికి కాపలాకి కుక్క లేకుండా ఎలా అసలే అటవీ ప్రాంతం అని ఒక కుక్కని కూడా తెచ్చి పెట్టుకున్నారు, మరి ఉన్న పిల్లికి కుక్కకి ఆహార నిమిత్తం అని కొద్దిగా కోళ్ళని కూడా పెంచడం మొదలుపెట్టారు.
ఇలా ఒక ఆరు మాసాలు గడిచేసరికి కాశీయానం పూర్తి చేసుకొని గురువుగారు అడవివైపుగా ఆశ్రమానికి వస్తూ చూసి నిర్ఘాంత పోయారు , అక్కడ చుట్టూ అంత ఎక్కడ అడవి లాగే లేదు , ఒక ఊరు ఇల్లు పొలాలు కోళ్లు ఆవు వీటన్నిటిని చూసి శ్యామశర్మ ని అడిగారు
ఎం జరిగిందయ్యా అని
ఏమి లేదు గురువుగారు, కౌపీనాన్ని కాపాడుకొనే నెపం లో ఇంత దాక వచ్చింది , వెధవది కౌపీనం పోతే పోయింది అని ఆనాడే వదిలేసి న ధ్యానం లో నేను ఉంది ఉంటె ఇదంతా ఒకదాని మీద ఒకటి ఈ పటాటోపం అంతా పెరిగేది కాదు అని అన్నాడు.
మొత్తానికి ధ్యానం చేసుకుంటు బ్రహ్మచారి గా ఉండే శ్యామశర్మ గారికి గోచి నుంచి ఇంత పటాటోపం లో మునిగిపోయాడు.
"నేటి రోజుల లో మనం అన్వయించుకోడానికి, కావలిసి దానికన్నా ఎక్కువ , ఆ నిమిషానికి ఎదో ఆవరసం అవుతుంది అను అనుకోని సంసారాన్ని పెంచుకోడం - ఒక గోచి పీలిక తో పోయేదానికి ఎక్కువ శ్రమని తెచ్చిపెట్టుకోకూడదు అని సారాంశం."
పెద్దవాళ్ళు ఎవరు చెప్తుండగా విన్నది- బావుందని అందరికి తెలియజేశాను

No comments:
Post a Comment