ఆ రోజును నేను పొందిన అనుభూతిని ఇప్పటికి మరువలేను, చూడటానికి నా రెండు కనులు చాలలేదు ...!.
కనులకు ఆమడ దూరంలో చూపు మరల్చలేని అందం - ఆ అందం మనసుకి ఎంతో ఆహ్లాదం
చుట్టూ చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన గాలి వీస్తూ నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్న క్షణం లో అసలు చుట్టు పక్కల ఎం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా అలా దాని వంకే చూస్తూ ఉండిపోయా.
ప్రపంచపు వింతల్లో ఒకటైన తాజ్మహల్ చూడటానికి ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు.
వెన్నెల కంటే తెల్లగా పాల రాతితో ఆ ఎతైన భవనం , వెనుక భాగం లో ఆ నదితీరం... రాత్రి సమయం లో ఆ పాల రాతి భవనపు ప్రతిబింబం ఆ నీటిలో పడి వెన్నెల పారుతున్న నది వలె అనిపిస్తుంది, చందమామ కూడా చూసి సిగ్గు పడే ఆ తాజ్ అందం అనిర్వచనీయం.
ఈ తాజ్-మహల్ ని ఇంత అందంగా మలచిన వారికీ నా జోహారులు.
ఎన్ని రోజులైనా మరువలేని నా అనుభవాలలో ఇది ఒక తీయటి అనుభూతి అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

No comments:
Post a Comment