Sunday, December 25, 2011

మనసుని ఆహ్లాదపరిచే క్షణాలు-మరువలేని అందాలు ...!

                                ఆ రోజును నేను పొందిన అనుభూతిని ఇప్పటికి మరువలేను, చూడటానికి నా రెండు కనులు చాలలేదు ...!. 


కనులకు ఆమడ దూరంలో చూపు మరల్చలేని అందం - ఆ అందం మనసుకి ఎంతో ఆహ్లాదం
చుట్టూ చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన  గాలి వీస్తూ నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్న క్షణం లో అసలు చుట్టు పక్కల ఎం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా అలా దాని వంకే చూస్తూ ఉండిపోయా.






ప్రపంచపు వింతల్లో ఒకటైన తాజ్మహల్ చూడటానికి ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 
వెన్నెల కంటే  తెల్లగా పాల రాతితో ఆ ఎతైన భవనం , వెనుక భాగం లో ఆ నదితీరం... రాత్రి సమయం లో ఆ పాల రాతి భవనపు ప్రతిబింబం ఆ నీటిలో పడి వెన్నెల పారుతున్న నది వలె అనిపిస్తుంది, చందమామ కూడా చూసి సిగ్గు పడే ఆ తాజ్  అందం అనిర్వచనీయం. 


ఈ తాజ్-మహల్ ని ఇంత అందంగా మలచిన వారికీ నా జోహారులు. 
ఎన్ని రోజులైనా మరువలేని నా అనుభవాలలో ఇది ఒక తీయటి అనుభూతి అని చెప్పడం  లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.



Monday, June 28, 2010

నా బాల్యం !

పున్నమి వెన్నెలలో గోరు ముద్దలు తిన్నాను 
స్వాతి చినుకుల తాకిడికి అడుగులు వేసాను 
ఆమని కోయిల కుహు కుహు లో మాటలు నేర్చాను 
గ్రీష్మ ఆవిరి లో ఎదిగి, 
ఎన్నో వసంతాలు గడిపి ,
యవ్వనపు ఆనందోత్సాహాల్ని ఆస్వాదిస్తూ... 
మధురమైన బాల్య స్మృతులను నెమరువేసుకుంటూ ....
చిన్ని చిన్ని ఆశలతో.....!!

రేయి నిండిన ఆకాశం

కారు మబ్బుల చీర కట్టి 
చుక్కల పూల మాల పెట్టి 
చందమామను నుదుట పెట్టి 
పాలపుతను మెడకు కట్టి 
మమ్ములను జోకొట్టే అమ్మగా వస్తుంది రేయి నిండిన ఆకాశం !!
నే వస్తూ సంధ్య సమయాన్ని తెస్తా 
నే వెళ్తూ వేకువ వేలుగునిస్తా
నా మేను కారు నలుపు 
నా ఒడిలో నా పిల్లలు ముత్యాల తెలుపు
నా దిష్టి చుక్క తెలుపు అది చిన్నపిల్లలకు నిద్ర పిలుపు 
నా సంపద లేక్కపెట్టలేనిది నా అందం అనిర్వచనీయమైనది 
నన్ను చూసి ఆశ్చర్య పడతారు కనుచూపు మేరలో ఇంత అందం ఉందా అని..
అదే రేయి నిండిన గగనం!!