Monday, June 28, 2010

నా బాల్యం !

పున్నమి వెన్నెలలో గోరు ముద్దలు తిన్నాను 
స్వాతి చినుకుల తాకిడికి అడుగులు వేసాను 
ఆమని కోయిల కుహు కుహు లో మాటలు నేర్చాను 
గ్రీష్మ ఆవిరి లో ఎదిగి, 
ఎన్నో వసంతాలు గడిపి ,
యవ్వనపు ఆనందోత్సాహాల్ని ఆస్వాదిస్తూ... 
మధురమైన బాల్య స్మృతులను నెమరువేసుకుంటూ ....
చిన్ని చిన్ని ఆశలతో.....!!

రేయి నిండిన ఆకాశం

కారు మబ్బుల చీర కట్టి 
చుక్కల పూల మాల పెట్టి 
చందమామను నుదుట పెట్టి 
పాలపుతను మెడకు కట్టి 
మమ్ములను జోకొట్టే అమ్మగా వస్తుంది రేయి నిండిన ఆకాశం !!
నే వస్తూ సంధ్య సమయాన్ని తెస్తా 
నే వెళ్తూ వేకువ వేలుగునిస్తా
నా మేను కారు నలుపు 
నా ఒడిలో నా పిల్లలు ముత్యాల తెలుపు
నా దిష్టి చుక్క తెలుపు అది చిన్నపిల్లలకు నిద్ర పిలుపు 
నా సంపద లేక్కపెట్టలేనిది నా అందం అనిర్వచనీయమైనది 
నన్ను చూసి ఆశ్చర్య పడతారు కనుచూపు మేరలో ఇంత అందం ఉందా అని..
అదే రేయి నిండిన గగనం!!